అర్సపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జినిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలి

  నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   నిజామాబాద్ నగరంలోని అర్సపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు నత్తనడకన నడుస్తున్నాయని, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, ప్రభుత్వాల ఉదాసీనత మూలంగా పనులు పూర్తవటానికి మరొక రెండు సంవత్సరాలు పట్టే అవకాశం ఉందని నిజామాబాద్ నగర అభివృద్ధి కమిటీ గౌరవాధ్యక్షులు దీకొండ యాదగిరి అన్నారు. నిజామాబాద్ నగర అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శనివారం ప్రతినిధి బృందం అర్సపల్లి అభివృద్ధి కమిటీ సంయుక్తంగా అరసపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా దీకొండ యాదగిరి మాట్లాడుతూ 137...