Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 February 2025, 6:16 pm Posted by : ramakrishna

సమాజ మార్పుతోనే సమసమాజ నిర్మాణం

నిజామాబాద్ సిటీ,బతుకమ్మ : సమ సమాజ నిర్మాణం జరగాలంటే సమాజంలో మార్పు జరగడం ద్వారానే సమ సమాజం నిర్మాణo జరుగుతుందని డిటిఎఫ్ మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి సంస్మరణ సభలో పాల్గొన్న నాయకులు పేర్కొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని సిద్ధార్థ జూనియర్ కాలేజీలో ఆదివారం రొడ్డ రాజన్న సంస్మరణ  నిర్వహించారు. ఈ సంస్మరణ సభలో పాల్గొన్న డిటిఎఫ్ రాష్ట్ర మాజీ నాయకులు డాక్టర్ లచ్చయ్య, ఎల్  శ్రీధర్, ప్రస్తుత రాష్ట్ర ఉపాధ్యక్షులు శoతన్, జిల్లా అధ్యక్షులు ఎం. బాలయ్య లు మాట్లాడుతూ గత సంవత్సరం ఇదే రోజు రొడ్డ రాజన్న ఆకస్మికంగా మరణించడం ద్వారా ఒక సామాజిక ఆలోచన కలిగిన ఉద్యమకారున్ని,  డిటిఎఫ్  కోల్పోయినట్లు అయిందని అన్నారు. ఆయన లేని లోటు పూడ్చలేనిదని ఆయన ఆదర్శాలు, ఉద్యమ స్ఫూర్తి కొనసాగించడమే ఆయనకు సమర్పించే నిజమైన నివాళి అని నాయకులు పేర్కొన్నారు. ఈ సమావేశంలో యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి డి సత్యనంద్, డిటిఎఫ్ నాయకులు పెంటన్న, విజయ్ కుమార్, రాజేందర్, అశోక్, షేక్ మదర్ జాన్ విల్సన్ స్నేహితులు, రాజేశ్వర్ పెద్దన్న,  కుటుంబ సభ్యులు బంధువులు తదితరులు పాల్గొన్నారు.

The construction of the same society with the change of society