Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 November 2024, 1:51 pm Posted by : ramakrishna

నూతన భవన నిర్మాణం అభినందనీయం

నిజామాబాద్, బతుకమ్మ:  నగరంలో కొనసాగుతున్న బాపూజీ వాచనాలయం భవన నిర్మాణ పనులను మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి శుక్రవారం పరిశీలించారు. సుమారు ఏడు దశాబ్దాలుగా పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న యువతీయువకులకు, నగర వాసులకు వాచనాలయం సేవలందాయని, నూతన భవన నిర్మాణ పనులు చేపట్టడం అభినందనీయమని ఆయన అన్నారు. తనవంతుగా నిర్మాణ పనుల కోసం రూ.10లక్షలు అందజేస్తానని అన్నారు. ఈ సందర్భంగా బాపూజీ వాచనాలయ కమిటీ సభ్యులు ఆయనను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ , బాపూజీ వాచనాలయ కమిటీ చైర్మన్ భక్తవత్సలం (ఢిల్లీ), ప్రధాన కార్యదర్శి  బాలక్రిష్ణ, కోశాధికారి గంగాధర్ రావు , కార్యవర్గ సభ్యులు లక్ష్మీనారాయణ , మీసాల సుధాకర్ రావు , బోగ అశోక్ , మహిపాల్ రెడ్డి , లక్కంరెడ్డి , ప్రతాప్ రుద్ర, దిలీప్ పవార్ తదితరులు పాల్గొన్నారు.


The construction of the new building is commendable