ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వేగవంతంగా పూర్తి చేయాలి
జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి పట్టణంలో చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్ కామారెడ్డి పట్టణంలోని రాజా నగర్ కాలనీలో పర్యటించి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ప్రగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా బెస్ట్ మెట్ వరకు నిర్మాణం పూర్తయినదానికి బిల్లులు మంజూరు అయ్యాయా?ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని లబ్ధిదారును అడిగి ఎలాంటి సమస్య రాకుండా ప్రభుత్వం ఉచితంగా...