Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 May 2025, 4:37 pm Posted by : ramakrishna

గంగమ్మ వాగు బ్రిడ్జి నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలి

రామారెడ్డి, బతుకమ్మ : రామారెడ్డి మండల కేంద్రంలోని గంగమ్మ వాగు బ్రిడ్జి నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గురువారం డీఏఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కామారెడ్డి జిల్లా కేంద్రానికి బ్రిడ్జి వారధిగా ఉన్నందున 20 గ్రామాల ప్రజలు ఈ బ్రిడ్జి పై నుండి కామారెడ్డి జిల్లా కేంద్రానికి వివిధ పనుల నిమిత్తం వస్తారని తెలిపారు. రైతులకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వర్షాకాలం మొదలుకాకముందే బ్రిడ్జి నిర్మాణం పూర్తిగా చేపట్టి అందుబాటులోకి తేవాలని కోరారు. ఎల్లారెడ్డి ఎంఎల్ఏ మదన్మోహన్  రావు వెంటనే స్పందించి పనులను పూర్తి చేయించాలని లేని యెడల ప్రజా క్షేత్రం లో నిలదీస్తామని హెచ్చరించారు. కామారెడ్డి ఎంఎల్ఏ రమణారెడ్డి కూడా స్పందించాలని కొరారు. ఈ రహదారి గుండా బుగ్గ రామలింగేశ్వర, కాలభైరవ స్వామి టెంపుల్ కి వేల మంది భక్తులు వస్తారని వారిని, రైతులను దృష్టిలో పెట్టుకొని పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో  బిఆర్ఎస్ రామారెడ్డి మండల పార్టీ కార్యదర్శి బుచ్చిరెడ్డి , మాజీ ఎంపీపీ దశరత్ రెడ్డి, మాజీ రైతుబంధు మండల అధ్యక్షులు నారాయణరెడ్డి ,మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ పడిగేల శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ రాజా గౌడ్, మాజీ సర్పంచులు గంగారం, రాజనర్సు,ప్రభాకర్ పంతులు, మాజీ ఉపసర్పంచ్ పోతునూ రి ప్రసాద్, టిఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులు రెడ్డి మల్లేష్, సంతోష్ రెడ్డి, గౌస్,గజ్జెల శంకర్,గొర్రె శంకర్,హన్మాండ్లు,యూత్ ప్రెసిడెంట్ శ్రీనివాస్,రాజేందర్ నాయక్,బాలు నాయక్,సత్య రాజు పాల్గొన్నారు.

The construction of Gangamma Vagu Bridge should be completed soon.