Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 January 2026, 6:08 pm Posted by : ramakrishna

దేశానికి దిక్సూచి అంబేద్కర్ రచించిన రాజ్యాంగం

వేల్పూర్, బతుకమ్మ :

 

బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం భారత దేశాని కే దిక్సూచి అని టీఎన్జీవోస్ జిల్లా ఉపాధ్యక్షుడు బత్తుల మాణిక్యం అన్నారు. 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వేల్పూర్ మండల కేంద్రంలోని ఐకేపీ సిబ్బంది సమక్షంలో కార్యాలయం ముందు జాతీయ జెండా ఎగురవేశారు.  మహిళా సమైక్య సమక్షంలో అర్హులైన ప్రతి మహిళకు రుణాలు అందించాలని మహిళలను ఆర్థికాభివృద్ధిలోకి నడిపించడానికి కలిసికట్టుగా పనిచేసి మహిళల జీవితాల్లో వెలుగు నింపాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ సీసీలు వెన్న మురళీ, సాయన్న, సరళ, మార్వడి రాధ, లక్మి, సునీత, ఐకేపీ అధ్యక్షురాలు సరోజా, విజయలక్ష్మి, లలిత, మహిళా సమాఖ్య వివోఏ లు తదితరులు పాల్గొన్నారు.

 

 

The Constitution written by Ambedkar is a compass for the country.