భారతీయుల పవిత్ర గ్రంథమే భారత రాజ్యాంగం
తెయూ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ టి.యాదగిరిరావు నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : భారతీయుల పవిత్ర గ్రంథమే భారత రాజ్యాంగం అని తెయూ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ టి.యాదగిరిరావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం తెలంగాణ విశ్వవిద్యాలయంలో మహనీయుల జయంతి ఉత్సవాలలో భాగంగా సోమవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆలోచనలో సామాజిక న్యాయం -విద్యా యువత సాధికారత అనే అంశంపై ఎస్సీ సెల్ డైరెక్టర్ డాక్టర్ వాణి నేతృత్వంలో కార్య శాల నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వర్సిటీ వైస్- ఛాన్స్లర్ ప్రొఫెసర్...