కేంద్రం చేస్తున్న కుట్రలను తిప్పి కొట్టాలి
నిజామాబాద్, బతుకమ్మ : ఉపాధిహామీ చట్టాన్ని నీరుగార్చే బిల్లును కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని ఏఐకేఎంఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈసందర్బంగా మోపాల్ మండల కేంద్రంలో ఈబిల్లుకు సంబంధించిన పత్రాలను, కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈసందర్భంగా ఏఐకేఎంస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టిందని, వ్యవసాయ కార్మికులకు, పేదలకు తీవ్రంగా నష్టం చేసే ఈబిల్లునుఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పనిదినాలను పెంచామనే పేరుతో కూలీల సంఖ్యను భారీగా తగ్గిస్తున్నారన్నారు....