Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 April 2025, 7:00 pm Posted by : ramakrishna

ప్రతి ఒక్కరి కడుపు నింపేది కాంగ్రెస్ ప్రభుత్వం

  • టి పి సి సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి

 

బతుకమ్మ భిక్కనూరు:ప్రతి ఒక్కరి కడుపు నింపేదే కాంగ్రెస్ ప్రభుత్వమని టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని బస్వాపూర్ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రేషన్ షాపులో సన్న బియ్యం కార్యక్రమంలో భాగంగా దళిత వాడలో దళితులతో కలిసి సన్న బియ్యంతో వండిన భోజనాన్ని చేశారు. గత ప్రభుత్వం హామీలే తప్ప ఆచరణ లేదని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలే కాకుండా నిరుపేద కుటుంబాల ఆకలి తీర్చే పథకాలను ప్రవేశ పెడుతుందన్నారు. రానున్న కాలంలో రాష్ట్రంలో ప్రవేశపెట్టే పథకాల గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లాలో జరిగే అభివృద్ధి పనుల గురించి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో  ఏఎంసీ చైర్మన్ రాజు, గ్రామ కాంగ్రెస్ నాయకులు స్వామి, జీవన్, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

The Congress government is filling everyone's stomach.14523