Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 October 2024, 6:12 pm Posted by : ramakrishna

రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

-రైతుభరోసా ఎగవేతపై మండలాల్లో నిరసనలు

-బి ఆర్ ఎస్ శ్రేణులకు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పిలుపు

దుబ్బాక, బతుకమ్మ : ఎన్నికల్లో హామీల వర్షం కురుపించిన సీఎం రేవంత్ రెడ్డి రైతులకు నేడు మోసం చేశారని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు ఇవ్వాల్సిన వర్షాకాల రైతుభరోసా ఎగ్గొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకి నిరసనగా బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు పిలుపు మేరకు ఆదివారం దుబ్బాక నియోజకవర్గం లోని అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. తాము అధికారం లోకి రాగానే ఎకరానికి రూ. 15 వేల రైతు భరోసా ఇస్తామని చెప్పి, నేడు వానాకాలం పంట పూర్తి అయినా ఇవ్వలేరని, కేబినెట్ సబ్ కమిటీ నివేదిక తర్వాత యాసంగి లో ఇస్తామని మాట్లాడటం రైతులను మోసం చేయడమే అవుతుందన్నారు..రుణమాఫీ పూర్తి కాలేదు, రైతు భరోసా లేదని,రైతులను మోసం చేసిన కాంగ్రెస్ తీరును ఆయా మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమంలు చేపట్టి ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు సూచించారు.