ఎన్నికల హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించింది
బతుకమ్మ భిక్కనూరు: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను విస్మరించి గత 13 నెలలుగా రైతులకు తీవ్ర అన్యాయం చేస్తుందని శుక్రవారం భిక్కనూరు ఎమ్మార్వో కార్యాలయంలో బిజెపి మండల శాఖ ఆధ్వర్యంలో నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ రైతులకు రైతు భరోసా పేరుతో ఎకరాకు ఖరీఫ్ కు, రబికి కలిపి ఏడాదికి 15000 ఇస్తామని మేనిఫెస్టోలో పేర్కొని ఇప్పటివరకు రైతులకు ఎలాంటి ఆర్థిక సహాయం చేయకపోగా కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తుందని, రైతు రుణమాఫీ...