Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 January 2025, 5:25 pm Posted by : ramakrishna

ఎన్నికల హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించింది

బతుకమ్మ  భిక్కనూరు:  కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను విస్మరించి గత 13 నెలలుగా రైతులకు తీవ్ర అన్యాయం చేస్తుందని శుక్రవారం భిక్కనూరు ఎమ్మార్వో కార్యాలయంలో బిజెపి మండల శాఖ ఆధ్వర్యంలో నాయకులు  వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ రైతులకు రైతు భరోసా పేరుతో ఎకరాకు ఖరీఫ్ కు, రబికి కలిపి ఏడాదికి 15000 ఇస్తామని మేనిఫెస్టోలో పేర్కొని ఇప్పటివరకు రైతులకు ఎలాంటి ఆర్థిక సహాయం చేయకపోగా కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తుందని, రైతు రుణమాఫీ పేరుతో నామమాత్రపు రుణమాఫీ చేస్తూ రైతులను మరియు తెలంగాణ ప్రజలను పథకాల పేరుతో మోసాలు చేస్తుందని  ఆరోపించారు.  ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వం  రైతులకు ఎలాంటి ఆంక్షలు లేకుండా రెండు లక్షల రుణమాఫీ వెంటనే అమలు చేయాలని, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలో వెంటనే అమలు చేయాలని, ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం వారి రాజకీయ  ప్రయోజనాలకు కాకుండా రైతు ప్రయోజనాల గురించి ఆలోచించి వెంటనే రైతు రుణమాఫీ మరియు రైతులకు అందాల్సిన సంక్షేమ పథకాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు ఉప్పరి రమేష్,  కిసాన్ మోర్చా అధ్యక్షులు జైపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి అతెల్లి తిరుమలేష్ మహిళా మోర్చా అధ్యక్షురాలు లక్ష్మి ప్రమీల  జిల్లా కార్యవర్గ సభ్యులు రెడ్డి గారి రమేష్ రెడ్డి నరేందర్ రెడ్డి ఎస్సీ మోర్చా అధ్యక్షులు రాకేష్ ప్రవీణ్ గౌడ్, రాఘవరెడ్డి నరేందర్ చంద్రం కమ్మరి ప్రవీణ్ మరియు బిజెపి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.