Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 October 2025, 7:32 pm Posted by : ramakrishna

కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే ఎన్నికలను వాయిదా వేసింది

  • బిజెపి మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ

 

రుద్రూర్, బతుకమ్మ : కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే ఎన్నికలను వాయిదా వేసిందని రుద్రూర్ మండల బీజేపీ అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ స్పష్టం చేశారు. గురువారం రుద్రూర్ మండల కేంద్రంలోని బిజెపి పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలను కావాలనే ప్రభుత్వం వాయిదా వేసిందని, ప్రభుత్వ ఉద్యోగులను, ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా ఇలా ఎన్నికలను వాయిదా వేయలేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇలా జరగడం ఇదే మొదటిసారి అని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం  మోసపూరిత మాటలతో ప్రజలను నమ్మించి మభ్యపెడుతుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ గూడూరు ప్రశాంత్ గౌడ్, బిజెపి సీనియర్ నాయకులు పార్వతి మురళి, కటికే రామ్ రాజ్, చిదుర మహిపాల్, ప్రధాన కార్యదర్శి ఏముల గజేందర్, ఉపాధ్యక్షులు బోజిగొండ అనిల్, ఓబీసీ మోర్చా అధ్యక్షులు ఓదెల సతీష్ పవర్, కురుమే బాబురావు, బిజెపి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.