Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 May 2025, 4:40 pm Posted by : ramakrishna

కార్పొరేషన్ పై కాంగ్రెస్ జెండా ఎగరాలి

  • ఎమ్మెల్సీ బలుమూరు వెంకట్

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో నిజామాబాద్ కార్పొరేషన్ పై కాంగ్రెస్ జెండా ఎగిరేల ప్రతీ కార్యకర్త కృషి చేయాలని ఎమ్మెల్సీ బలుమూరు వెంకట్ పిలుపునిచ్చారు.నగరంలోని 25వ డివిజన్ గోన రెడ్డి కళ్యాణ మండపంలో గురువారం నిర్వహించిన  6 ,7,8,22,23,24,25,26,28,45,50 డివిజన్లకు సంబంధించిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. నగరంలో గతంలో ఉన్న ప్రభుత్వాల హయాంలో జరగని అభివృద్ధి ఈ 18 నెలల్లో  జరుగుతుందన్నారు. రాబోయే రోజుల్లో పార్టీ పదవులను పార్టీ కొరకు కష్టపడిన వారికి ఇవ్వడం జరుగుతుందన్నారు గత అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఏ డివిజన్లో ఎన్ని ఓట్లు వచ్చాయో దాని ప్రకారమే పార్టీలో పదవులు ఉంటాయన్నారు.పార్టీ బలహీనంగా ఉందని నేతలు ఎవరు చెప్పవద్దని నేతల తీరు వల్లే పార్టీ బలహీన పడిందని అనుకోవాల్సి ఉంటుందన్నారు.ఈ సమావేశంలో ఉర్దూ అకాడమీ చైర్మన్  తాహేర్ బిన్ హూందాన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు.డివిజన్ లలోఉన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తూ వాటిని పరిష్కారం చేయించడంతోపాటు ప్రజలతో మమేకమై పని చేస్తే రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలిచేందుకు అవకాశం ఉంటుందన్నారు.ఈ సమావేశంలో నుడా చైర్మన్ ,నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కేశవేణు,గ్రంధాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజరెడ్డి ,నాయకులు శేఖర్ గౌడ్ ,రత్నాకర్ ,రాంభూపాల్ ,రామకృష్ణ ,జావిద్ అక్రమ్ ,రామర్తి గోపి,యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు విపుల్ గౌడ్, 6వ డివిజన్ అధ్యక్షుడు అంతిరెడ్డి విజయపాల్ రెడ్డి ,రేవతి తదితరులు పాల్గొన్నారు.