Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 November 2025, 8:18 pm Posted by : ramakrishna

ప్రతిరోజు అంబులెన్స్ కండిషన్ చెక్ చేసుకోవాలి

  • ట్రాఫిక్ ఇన్స్ పెక్టర్ ప్రసాద్

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : అత్యవసర సమయంలో అంబులెన్స్ సేవలు అవసరం అవుతాయని, వాటి కండిషన్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలని ట్రాఫిక్ ఇన్స్ పెక్టర్ ప్రసాద్ సూచించారు. నిజామాబాద్ అంబులెన్స్ సర్వీసెస్ ఆధ్వర్యంలో బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సమావేశానికి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రసాద్, వన్ టౌన్ ఎస్ హెచ్ ఓ రఘుపతి హాజరయ్యారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ తప్పనిసరిగా రోడ్డు నియమాలు పాటించాలని సూచించారు. అదేవిధంగా అంబులెన్సులు అత్యవసర సమయాలలో వారి యొక్క సేవలు ఉండును కాబట్టి తప్పనిసరిగా ప్రతిరోజు అంబులెన్స్ యొక్క కండిషను చూసుకోవాలని అదేవిధంగా అంటే అంబులెన్స్ టైర్ లలో తగిన మోతాదులో గాలి ఉండేటట్లు, బ్రేకులు, క్లచ్ , సరిపోయే విధంగా హెడ్లైట్, ఆక్సిజన్ , ఫైర్ ఎక్సటింగ్ విషర్ ఉండాలని సూచించారు. అంతేకాకుండా అంబులెన్స్ వాహనాలు వారికి కేటాయించినటువంటి పార్కింగ్ స్థలంలో మాత్రమే పార్కు చేయవలెనని ఎట్టి పరిస్థితిలో రోడ్డుమీద కానీ ప్రక్కన కానీ అంబులెన్స్ వాళ్ళు వారి యొక్క వాహనాలను పార్కింగ్ చేసి అసౌకర్యానికి గురి చేయవద్దని , ట్రాఫిక్ జాము కాకుండా చూడాలని తెలిపారు. అంతేకాకుండా అంబులెన్స్ డ్రైవర్లు పేషెంట్ ను హాస్పిటకు వెళ్లే సమయంలో మాత్రమే అంబులెన్స్ యొక్క సైరన్ను వినియోగించుకోవాలని మిగతా సమయంలో ఎట్టి పరిస్థితుల్లో సైరన్ వాడకూడదని సూచించారు. ఈ సమావేశంలో వన్ టౌన్ ఎస్ హెచ్ వో రఘుపతి మాట్లాడుతూ అంబులెన్స్ లో ఎట్టి పరిస్థితిలో అసాంఘిక కార్యకలాపాలు జరగకూడదని లేనియెడల చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడునని అన్నారు.

The condition of the ambulance should be checked every day.