Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 December 2025, 12:22 pm Posted by : ramakrishna

పోలింగ్ బందోబస్తును పర్యవేక్షించిన కమిషనర్

 నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : 

 

నిజామాబాద్ జిల్లాలో జరుగుతున్న రెండో విడత పంచాయతీ ఎన్నికల బందోబస్తును పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పర్యవేక్షించారు. నిజామాబాద్ డివిజన్ పరిధిలో మొపాల్ , డిచ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ని పోలింగ్ కేంద్రాన్ని రెండవ విడుత ఎన్నికల నేపథ్యంలో బందోబస్తు ఏర్పాట్లు , పోలింగ్ సరళిని సిపి సాయి చైతన్య పరిశీలించారు. ఆదివారం మొపాల్ , డిచ్ పల్లి మండలంల కేంద్రం లోని కంజర, కులాస్పూర్ , ఘన్పూర్ , ధర్మారం (బి) గ్రామాలలోని జిల్లా పరిషత్ హై స్కూల్ పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాట్లు , భద్రతా చర్యలను పరిశీలించారు.ఈ సందర్బంగా సంబంధిత అధికారులతో మాట్లాడుతూ ఎన్నికలు పూర్తిగా ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛాయుతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలను తీసుకోవాలని , సిబ్బంది అధికారులు అప్రాతంగా ఉండాలని సూచించడం జరిగింది. ప్రజలు శాంతి యూత వాతావరణం లో తమ ఓటు హక్కు ను సధ్వినియోగం పర్చుకోవాలని సూచించారు. సిపితోపాటు నిజామాబాద్ ఏ.సి.పి రాజా వెంకటరెడ్డి, సీఐ చందర్ రాథోడ్ ఎస్సైలు మహేష్ ఆరిఫ్ సుమలత , ఆర్వో అధికారులు శ్రీనివాస్ , షేక్ మస్జీద్ , రాజ నరసయ్య , మధుసూదన్ అధికారులు గలరు.

The commissioner supervised the polling arrangements