కంజర జ్యోతిబాపూలే పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

    మోపాల్ , బతుకమ్మ : మోపాల్ మండలం కంజర గ్రామంలోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ బాలుర గురుకుల పాఠశాలను కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి మంగళవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టోర్ రూమ్, కిచెన్, డైనింగ్ హాల్, డార్మెటరీ, బాత్ రూంలు, లైబ్రరీ తదితర వాటిని పరిశీలించారు. పిల్లలు ఆరు బయట భోజనం చేస్తుండడాన్ని గమనించిన కలెక్టర్, పాఠశాల ప్రిన్సిపాల్ మురళిని ఈ విషయమై ప్రశ్నించారు. అన్ని హంగులతో నూతనంగా నిర్మించిన డార్మెటరీ బ్లాక్ అందుబాటులో ఉన్నప్పటికీ ఆరు బయట భోజనం...