Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 September 2024, 10:44 am Posted by : ramakrishna

హస్టల్ విద్యార్ధులతో కలిసి అల్పహరం చేసిన కలెక్టర్

The collector had breakfast with the hostel students

 

 విద్యార్ధులకు నాణ్యమైన బోజనం అందించాలని అదేశాలు

. . . మైనార్టి గురుకుల పాఠశాల తనిఖీ

 ఎల్లారెడ్డి, బతుకమ్మ :

వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆశిష్  సంగ్వాన్ ఆదేశించారు. ఎల్లారెడ్డి సాంఘిక సంక్షేమ వసతి గృహంలో శుక్రవారం రాత్రి ఆయన బస  చేసిన కలెక్టర్ శనివారం ఉదయం విద్యార్థులతో కలిసి అల్పాహారం చేసి విద్యార్థులకు నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మైనార్టీ గురుకుల పాఠశాలను తనిఖీ చేసి విద్యార్థులతో కలిసి మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం పేద విద్యార్థుల చదువుల కోసం అనేక కృషి చేస్తుందని అధికారులు విద్యార్థులకు  నాణ్యమైన విద్య, పౌష్టికారాన్ని అందించాలని హెచ్చరించారు. ప్రతి విద్యార్థి రెండు మొక్కలను దత్తత తీసుకొని కాపాడాలని సూచించారు. మొక్కలతోనే మానవ మనుగడకు ఆధారం నెలకొందని ప్రతి ఒక్కరు మొక్కల పెంపకం పై శ్రద్ధ వహించాలని పేర్కొన్నారు. అనంతరం ఎల్లారెడ్డి లోని పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ఆయన వెంట ఆర్డిఓ ప్రభాకర్, ఎస్ ఎస్ సి సంక్షేమ శాఖ అధికారి దయానంద్, తదితరులు ఉన్నారు.

 

The collector had breakfast with the hostel students