నందిపేట్ మండలంలో ప్రభుత్వ పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్
నందిపేట్, బతుకమ్మ : నందిపేట మండలంలోని నూత్ పల్లి, తొండాకూర్ జిల్లా పరిషత్ , మండల పరిషత్ పాఠశాలలను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆకస్మికంగా తనిఖీలు చేశారు. నూత్ పల్లి లోని మహాత్మా జ్యోతిబాపూలే బాలుర గురుకులాన్ని సందర్శించి విద్యార్థుల కోసం వండిన భోజనాన్ని పరిశీలించారు. అన్నం సరిగా లేకపోవడానికి గమనించిన కలెక్టర్, గురుకులానికి కేటాయించిన బియ్యం నాణ్యతను తనిఖీ చేశారు. బియ్యం నాసిరకంగా ఉండడం,బస్తాలకు ట్యాగ్ లు లెకుండా చిరిగిపోయి కనిపించడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులకు...