Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 January 2025, 2:08 pm Posted by : ramakrishna

నందిపేట్ మండలంలో ప్రభుత్వ పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

 

నందిపేట్, బతుకమ్మ :

నందిపేట మండలంలోని నూత్ పల్లి, తొండాకూర్  జిల్లా పరిషత్ , మండల పరిషత్ పాఠశాలలను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆకస్మికంగా తనిఖీలు చేశారు. నూత్ పల్లి లోని మహాత్మా జ్యోతిబాపూలే బాలుర గురుకులాన్ని సందర్శించి విద్యార్థుల కోసం వండిన భోజనాన్ని పరిశీలించారు. అన్నం సరిగా లేకపోవడానికి గమనించిన కలెక్టర్, గురుకులానికి కేటాయించిన బియ్యం నాణ్యతను తనిఖీ చేశారు. బియ్యం నాసిరకంగా  ఉండడం,బస్తాలకు ట్యాగ్ లు లెకుండా చిరిగిపోయి కనిపించడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులకు ఫోన్ చేసి నాసిరకం బియ్యం స్థానంలో నాణ్యమైన సన్నబియ్యం కేటాయించాలని ఆదేశించారు.

The collector conducted a surprise inspection of government schools in Nandipet mandal

స్టోర్ రూమ్ లో నిలువ ఉంచిన ఆహార పదార్థాలు, కూరగాయలు, ఇతర సరుకులను పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా అని ఆరా తీశారు. తరగతి గదులను సందర్శించి విద్యాబోధన తీరును గమనించారు. విద్యార్థులకు పలు ప్రశ్నలు అడిగి వారి సామర్త్యాన్ని అంచనా వేశారు. వార్షిక పరీక్షలు సమీపించినందున సిలబస్ పూర్తి చేసి పునఃశ్చరణ తరగతులు నిర్వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఆయా సబ్జెక్టులలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి, వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని అన్నారు. అనంతరం తొండాకూర్ లోని ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలను కలెక్టర్ సందర్శించి విద్యార్థినీ విద్యార్థులకు వడ్డిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. నాణ్యతతో కూడిన పౌష్టిక ఆహారం అందించాలని నిర్వాహకులకు సూచించారు. ఆహార పదార్థాలు కలుషితం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు..

The collector conducted a surprise inspection of government schools in Nandipet mandal

నందిపేట్ మండలంలో ప్రభుత్వ పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్…

నందిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలను పరిశీలించారు. స్థానికంగా నిర్వహిస్తున్న రక్త పరీక్షలు, రోగులకు అందిస్తున్న చికిత్సల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.  అన్ని రకాల మందులను అందుబాటులో ఉండేలా చూసుకోవాలని సూచించారు. ఆసుపత్రిలోని రిజిస్టర్లను తనిఖీ చేసిన కలెక్టర్, స్థానికంగా అందుబాటులో ఉంటూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను, సిబ్బందిని ఆదేశించారు. కలెక్టర్ వెంట నందిపేట్ తహసీల్దార్ ఆనంద్, ఎంపీఓ లక్ష్మీప్రసాద్ తదితరులు ఉన్నారు.