సీఎం సోయి లేకుండా మాట్లాడుతుండు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: మోడీ, చంద్రబాబును మొక్కుతూ ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులను తొక్కేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ సభను చూసి భయపడ్డారని, సోయి లేకుండా మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి విమర్శించారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ తన పేరు ఉచ్చరించలేదని అక్కసుతో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని, ఆయన పేరును ప్రజలే ఉచ్చరించే పరిస్థితి లేదన్నారు. రేవంత్ కు రాజకీయ సమాధి కట్టేందుకు కొడంగల్ ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. స్థానిక...