ప్రారంభమైన సీఎం కప్ క్రీడలు
నిజామాబాద్, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీఎం కప్ క్రీడా పోటీలు జిల్లా కేంద్రంలో ప్రారంభమయ్యాయి. జిల్లా క్రీడా ప్రాథికార సంస్థ ఆధ్వర్యంలో గ్రామీణ స్థాయి క్రీడాకారులను ప్రోత్సహించాలన్న సదుద్దేశ్యంతో చేపట్టిన సీఎం కప్ -2024 ను ఉర్దూ అకాడమి చైర్మన్ తాహెర్ ప్రారంభించారు. ముందుగా క్రీడాకారుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా జండాను ఎగురవేసి క్రీడలను ప్రారంభించారు. క్రీడాకారులు క్రమశిక్షణతో అనేక విజయాలు సాధించాలని కోరారు. ఈ నెల 17 నుంచి 18 వరకు చెస్, సైక్లింగ్,...