నిజామాబాద్, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీఎం కప్ క్రీడా పోటీలు జిల్లా కేంద్రంలో ప్రారంభమయ్యాయి. జిల్లా క్రీడా ప్రాథికార సంస్థ ఆధ్వర్యంలో గ్రామీణ స్థాయి క్రీడాకారులను ప్రోత్సహించాలన్న సదుద్దేశ్యంతో చేపట్టిన సీఎం కప్ -2024 ను ఉర్దూ అకాడమి చైర్మన్ తాహెర్ ప్రారంభించారు. ముందుగా క్రీడాకారుల గౌరవ వందనాన్ని స్వీకరించారు.

ఈ సందర్భంగా జండాను ఎగురవేసి క్రీడలను ప్రారంభించారు. క్రీడాకారులు క్రమశిక్షణతో అనేక విజయాలు సాధించాలని కోరారు. ఈ నెల 17 నుంచి 18 వరకు చెస్, సైక్లింగ్, బాక్సింగ్, నెట్ బాల్ పోటీలు జరుగుతాయని తెలిపారు. గెలుపొందిన వారికి రాష్ట్ర స్థాయి క్రీడల్లో ఈ నెల 27 నుంచి జనవరి 2 వరకు జరిగే పోటీలలో పాల్గొనాల్సి ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్ డీవో ముత్తెన్న తదితరులు పాల్గొన్నారు.

ఒలింపిక్ సంఘానికి సిఎం కప్ లో చోటు లేదు
సోమవారం నుండి కలెక్టర్ మైదానం లో ప్రారంభమైన సిఎం కప్ ఆటల పోటీలలో ఒలింపిక్ సంఘ అధ్యక్ష, కార్యదర్శులను ప్రోటో కాల్ లో మర్చిపోయారు.అంతే కాకుండా నూడా చైర్మన్ జిల్లా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కేశ వేణు పేరు ను కూడా ఇన్విటేషన్ కార్డు లో మర్చిపోయారా కావాలని పెట్టా లేదా అయితే ఒలింపిక్ సంఘ అధ్యక్ష,కార్యదర్శులను సంప్రదించగా డి వై ఎస్ ఓ ఫోన్ చేసారని కానీ ఇన్విటేషన్ లో పేర్లు లేకపోవడం వల్లనే సి యం కప్ ప్రారంభోత్సవనికి రాలేదని తెలిపారు.అలాగే ప్రోటోకాల్ విషయంలో కలెక్టర్ ను కూడా సంప్రదిస్తామని జిల్లా ఒలింపిక్ సంఘఅధ్యక్ష,కార్యదర్శులు తెలిపారు.
