బాన్సువాడ ,బతుకమ్మ : కామారెడ్డి జిల్లా బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలోని మినీ స్టేడియంలో మండల స్థాయి, మున్సిపాలిటీ స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలు అట్టహాసంగా ప్రారంభం అయ్యాయి రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ బాన్సువాడ మున్సిపల్ చైర్మన్ గంగాధర్లు కలిసి సీఎం క పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు మాట్లాడుతూ గ్రామీణ స్థాయిలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఎటువంటి పోటీలు చాలా ఉపయోగపడతాయని అన్నారు గ్రామ స్థాయి క్రీడాకారులను ప్రోత్సహించడానికి సీఎం రేవంత్ రెడ్డి తనవంతు కృషి చేస్తున్నారని అన్నారు బాన్సువాడ నియోజకవర్గంలో ఎటువంటి క్రీడలను ప్రోత్సహించడానికి శాసనసభ్యులు శ్రీనివాస్ రెడ్డి మరియు తాను ఎల్లప్పుడూ ముందుంటానని బాలరాజు అన్నారు.అంతకు ముందు ఆయన వివిధ గ్రామాల నుంచి మరియు మున్సిపాలిటీ పరిధిలోని క్రీడాకారుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
