Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 December 2024, 4:12 pm Posted by : ramakrishna

బుక్ ఫెయిర్ కవి సమ్మేళనానికి ఘనపురం ఎంపిక హర్షనీయం

భీమ్ గల్, బతుకమ్మ : ఈ నెల 25న హైదరాబాద్ లోని ఎన్టీఆర్ గార్డెన్స్ లో నిర్వహించనున్న హైదరాబాద్ బుక్ ఫెయిర్ కవిసమ్మేళనానికి ప్రముఖ కవి, ప్రఖ్యాత వ్యాఖ్యాత, తెలుగు భాషోపాధ్యాయుడు, తెలంగాణ రచయితల సంఘం(తెరసం)రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఘనపురం దేవేందర్ ఎంపిక హర్షనీయమని “రామన్నపేట చరిత్ర” గ్రంథ రచయిత కంకణాల రాజేశ్వర్ అన్నారు. ఈ మేరకు నిర్వాహకుల నుండి ఘనపురం కు ఆహ్వానం అందిందని ఆయన తెలిపారు.మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రఖ్యాత కవులు, పుస్తక ప్రియుల సమక్షంలో జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం లభించడం యాద్రుచ్చికమన్నారు.ఈ సందర్బంగా ఘనపురానికి కంకణాల అభినందనలు తెలిపారు.