ముఖ్యమంత్రి నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుంది
ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ జిల్లా అధ్యక్షుడు భూక్య చంద్రు నాయక్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ముఖ్యమంత్రి నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుందని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ జిల్లా అధ్యక్షుడు భూక్యచంద్రు నాయక్ అన్నారు. నగరంలోని కంటేశ్వర్ లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బంజారా లంబాడీల మాతృభాష "గోర్ బోలి" ని రాజ్యాంగంలో ఎనిమిదవ షెడ్యూల్లో చేర్చాలని ముఖ్యమంత్రి తీర్మానించడం గర్వించదగ్గ విషయమని అన్నారు. దేశంలో హిందీ భాష తర్వాత తమ భాష...