- ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ జిల్లా అధ్యక్షుడు భూక్య చంద్రు నాయక్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ముఖ్యమంత్రి నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుందని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ జిల్లా అధ్యక్షుడు భూక్యచంద్రు నాయక్ అన్నారు. నగరంలోని కంటేశ్వర్ లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బంజారా లంబాడీల మాతృభాష “గోర్ బోలి” ని రాజ్యాంగంలో ఎనిమిదవ షెడ్యూల్లో చేర్చాలని ముఖ్యమంత్రి తీర్మానించడం గర్వించదగ్గ విషయమని అన్నారు. దేశంలో హిందీ భాష తర్వాత తమ భాష అయినా గోర్ బోలి మాట్లాడే వారి సంఖ్య ఎక్కువగా ఉన్నారని అన్నారు. అంతటి ప్రాముఖ్యత ఉన్న తమ భాషను ఇప్పటికైనా ప్రభుత్వాలు రాజ్యాంగంలో ఎనిమిదో షెడ్యూల్లో చేర్చి తమ భాషకు గౌరవం తీసుకురావాలని అన్నారు. తమకు మద్దతుగా నిలిచిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి కాంగ్రెస్ ప్రభుత్వానికి బంజారాల మద్దతు ఎప్పటికీ ఉంటుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ తుకారం నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి శివాజీ నాయక్, జిల్లా విశ్రాంత ఉద్యోగుల విభాగం అధ్యక్షులు రామారావు చౌహాన్,లాల్ సింగ్ నాయక్ దర్పల్లి మండల అధ్యక్షులు, మంగత్య నాయక్, ఏ ఎం సి డైరెక్టర్, రమేష్ రాథోడ్ జిల్లా కోశాధికారి, ఇందల్వాయి వర్కింగ్ ప్రెసిడెంట్ మోతిలాల్ నాయక్, మహిపాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.