- పీఆర్టీయూ టీఎస్ నిజామాబాద్ జిల్లా శాఖ
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఉద్యోగ, ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులు, డీఏలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరి ఆక్షేపనీయమని పీఆర్టీయూ టీఎస్ నిజామాబాద్ జిల్లా శాఖ నాయకులు అన్నారు. నగరంలోని పీఆర్టీయూ టీఎస్ జిల్లా కార్యాయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు తమ సర్వీసులో చేరినప్పటి నుంచి తమ పిల్లల చదువులు, పెళ్లిల్లు, వైద్య ఖర్చుల కోసం తమ జీతం నుంచి నెల నెలా ప్రభుత్వం వద్ద డీజీఎఫ్ డబ్బులు, మెడికల్ రీయింబర్స్ మెంట్ బిల్లులు, సరెండర్ బిల్లులు, సప్లిమెంటరీ బిల్లులు గత రెండు సంవత్సరాల నుంచి రావడం లేదన్నారు. రిటైరైన ఉద్యోగ, ఉపాధ్యాయుల గ్రాట్యూటీ, కమ్యూటేషన్, సరెండర్ డబ్బులు రావడం లేదన్నారు. తమకు న్యాయంగా రావాల్సినవి తప్ప బోనస్ లు, ఉచితాలు అడగడం లేదన్నారు. గత ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులను నిర్లక్ష్యం చేసినందుకే మిమ్మల్ని గెలిపించుకున్నామన్నారు. తమకు రావాల్సిన బకాయిలు, డీఏలు సకాలంలో ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మోహన్ రెడ్డి, కిషన్, నాయకులు గంటల అశోక్, చిలుక శ్రీనివాస్, సాయరెడ్డి, నగేష్ రెడ్డి, గోపి, వరప్రసాద్, రవినాయక్, బోగ లక్ష్మణ్, సాయన్న, నరేష్, మైఖేల్, మోహన్, ప్రవీణ్ పాల్గొన్నారు.