Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 February 2025, 9:37 pm Posted by : ramakrishna

పుడమికి  రసాయనం ప్రమాదకరం 

కమ్మర్పల్లి, బతుకమ్మ:  సాగు పరంగా భూమిపై వాడుతున్న రసాయనాలు ప్రమాదకరమని కెవికె రుద్రూర్ సైంటిస్టులు తెలిపారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో ప్రకృతి సేద్యంపై రైతులకు అవగాహన సదస్సును శుక్రవారం ఏర్పాటు చేసారు. ఈ సందర్బంగా వక్తలు మాట్లాడుతూ రసాయనాలు అధిక మోతాదులో వాడడం వల్ల దాని అవశేషాలు పంటపై నిక్షిప్తమై ఉంటాయన్నారు. ఇంటి కోసమైనా కొంత భాగంలో సేంద్రియ పద్దతిలో పంటను సాగు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయధికారితో పాటు ఎఈఓలు, రైతులు పాల్గొన్నారు.