Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 August 2026, 8:51 pm Posted by : ramakrishna

గీతన్నల చైతన్య యాత్రను జయప్రదం చేయాలి

 

. . . గౌడ సంఘం అధ్యక్షుడు సుధనవేని శ్రీనివాస్ గౌడ్

 

ఏర్గట్ల, బతుకమ్మ :

 

ఏర్గట్ల మండలంలోని తాళ్లరాంపూర్ గ్రామంలో ఈ నెల 14న నిర్వహించనున్న గీతన్నల చైతన్య యాత్ర సదస్సును విజయవంతం చేయాలని ఏర్గట్ల మండల గౌడ సంఘం అధ్యక్షుడు సుధనవేని శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మంగళవారం ఏర్గట్ల గ్రామ గౌడ సంఘం కమ్యూనిటీ హాల్‌లో “అమరుల యాదిలో… గీతన్నల చైతన్య యాత్రను జయప్రదం చేయండి” అనే నినాదంతో రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించారు. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ఈ నెల 14న తాళ్లరాంపూర్ గ్రామంలో నిర్వహించే గీతన్నల చైతన్య యాత్ర సదస్సుకు ముందు తెలంగాణ తల్లి, శివాజీ విగ్రహం వద్ద నుంచి గీతన్నల చైతన్య రథాన్ని ప్రారంభించి, మండలంలోని అన్ని గ్రామాల గీతా కార్మికులు బైక్ ర్యాలీగా తాళ్లరాంపూర్‌లోని గౌడ సంఘం సమావేశ ప్రాంగణానికి చేరుకుంటారని తెలిపారు. ఏర్గట్ల మండలంలోని అన్ని గ్రామాల గీతా కార్మికులు, గౌడ సంఘం సభ్యులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గీతా కార్మిక సంఘం అధ్యక్షుడు మేకపోతుల రమణ గౌడ్, ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్ గౌడ్ హాజరుకానున్నట్లు ఆర్మూర్ డివిజన్ గీతా కార్మికుల అధ్యక్షుడు, తాళ్లరాంపూర్ గ్రామానికి చెందిన కోటగిరి రామా గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కోటగిరి రామా గౌడ్, సుధనవేని శ్రీనివాస్ గౌడ్, పచ్చిమట్ల శంకర్ గౌడ్, రంగు కరుణకర్ గౌడ్, రాజేశ్వర్ గౌడ్, కోలా రమేష్ గౌడ్, రంగు గోవిందు గౌడ్, అన్నెల మురళి గౌడ్, పాకాల ప్రసాద్ గౌడ్, పచ్చిమట్ల ప్రదీప్ గౌడ్, కలకత్తా రమేష్ గౌడ్, నరేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే గ్రామ గీతా కార్మికులు, గౌడ సంఘం సభ్యులు హాజరయ్యారు.