ఆసిఫ్ ను పరామర్శించిన రాష్ట్ర మైనార్టీ కమిషన్ చైర్మన్

నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ నగర శివారులోని సారంగాపూర్ ప్రాంతంలో పాత నేరస్థుడు రియాజ్ చేతిలో తీవ్రంగా గాయపడి హైదరాబాద్ లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహమ్మద్ ఆసిఫ్ ఖాన్ ను రాష్ట్ర మైనార్టీస్ కమిషన్ చైర్మన్ తారిక్ అన్సారీ గురువారం పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఆసిఫ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సీ.సీ.ఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ ను హత్య చేసిన పాత నేరస్థుడు రియాజ్ ను పోలీసులు పట్టుకోవడంలో ఆసిఫ్ చూపిన తెగువ, కనబర్చిన...