Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 September 2025, 5:23 pm Posted by : ramakrishna

ప్రశ్నకు కేంద్ర బిందువు ఉపాధ్యాయులే  

  • డిటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.శంతన్

 

జక్రాన్ పల్లి, బతుకమ్మ : మనిషిలోని ఆలోచనల ప్రతిబింబమే ప్రశ్నించడమని అట్టి ప్రశ్నించే తత్వo విద్య ద్వారానే సాధ్యమని, విద్యను అందించే కర్మాగారాలు పాఠశాలలేనని ఇందులో పనిచేసే ఉపాధ్యాయులు ప్రశ్నకు కేంద్ర బిందువులని డిటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.శంతన్ అన్నారు. డిటిఎఫ్ సభ్యత్వ నమోదులో భాగంగా జాక్రాన్ పల్లి మండలంలోని వివిధ పాఠశాలలను పర్యటించి  ఉపాధ్యాయులతో ఏర్పాటుచేసిన సమావేశంలో శంతన్ మాట్లాడుతూ విద్య కున్న ప్రాధాన్యతను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించడం లేదని దేశానికి స్వతంత్రం సిద్ధించి 78 ఏళ్లు గడిచినా కూడా విద్యా రంగ లక్ష్యాలు నేరవేరడం లేదని నేటికీ దేశ అక్షరాస్యత 65 శాతం మించడం లేదని అన్నారు.  జనాభాపరంగా ప్రపంచంలోనే ప్రథమ లేదా ద్వితీయ స్థానం కొరకు పోటీ పడుతుందని, అక్షరాస్యత విషయంలో చాలా వెనుకబడి ఉన్నామని అందుకే భారతదేశానికి  అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో  చోటు దక్కడం లేదని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు విద్య రంగాన్ని అత్యంత ప్రాధాన్యత రంగంగా గుర్తించి విద్య ద్వారానే దేశ అభివృద్ధి సాధ్యమని తెలిపారు. అందుకు విద్య రంగానికి బడ్జెట్ కేటాయింపులు డాక్టర్ డి ఎస్ కొఠారి కమిషన్ సూచనల ప్రకారం కేంద్ర ప్రభుత్వం జిడిపిలో 6% రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్లో30 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. అప్పుడే సమాజంలోని ప్రతి ఒక్కరికి విద్య ను  పొందే హక్కులు  దక్కుతాయని, ఉపాధ్యాయులుగా సమాజంలోని  ప్రతి ఒక్కరిని విద్యావంతులుగా తీర్చిదిద్దే బాధ్యత ప్రతి ఉపాధ్యాయులపై ఉందని అన్నారు. అందుకు శక్తివంచన లేకుండా పనిచేసి  మన బాధ్యతను నెరవేర్చడం ద్వారానే సమాజంలో ఉపాధ్యాయులకు మంచి గౌరవం గుర్తింపు ఉంటుందని తెలిపారు. జిల్లా అధ్యక్షులు  యం.బాలయ్య మాట్లాడుతూ ఉపాధ్యాయుల ఉద్యోగుల సమస్యలు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉంటున్నాయని అన్నారు. సమస్యలు పరిష్కరించుకోవడానికి తెలంగాణ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర ప్రభుత్వం తో నిన్న జరిపిన చర్చల్లో పాక్షికంగా కొన్ని సమస్య ల పట్ల నిర్ణయాలు జరిగినాయని తెలిపారు. హెల్త్ కార్డు విషయంలో ఈ వారంలో మరోసారి సమావేశమై హెల్త్ కార్డు సమస్యపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని అన్నారు. జులై 2025 నుండి ఒక డిఎ అమలు చేస్తారని, వారంలో జీవో విడుదల అవుతుందని తెలిపారు. సిపిఎస్ రద్దు విషయంలో నిర్ణయం తీసుకోవడానికి ప్రభుత్వానికి ఒక్క సంవత్సరం గడువు పెట్టడం జరిగిందని, పెండింగ్ బిల్లుల విషయంలో ప్రతినెల 700 నుండి 750 కోట్ల రూపాయలు చెల్లింపులకు అంగీకారం జరిగిందని తెలిపారు. ఉపాధ్యాయేతర ఉద్యోగులకు సంబంధించి కొన్ని సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని ఇంకా అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయని అన్నారు. ఐదేళ్లకు ఒకసారి వేతన స్కేల్ల సవరణ జరగవలసి ఉందని ఏడేళ్లు గడిచిన వేతన స్కేల్ల సవరణకు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు రూల్స్ సమస్యను ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రతి సంవత్సరం వేసవిలో ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు చేపట్టుటకు  ఒక కోడును రూపొందించి అమలు చేయాలని, రెండేళ్లుగా కారుణ్య నియామకాలు చేపట్టడం లేదని తక్షణమే కారణ నియమాకాలు చేపట్టాలని, కేజీబీవీ మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల దీర్ఘకాల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జడ్పీహెచ్ఎస్ అర్గుల్, నారాయణపేట్, కేజీబీవీ పాఠశాల, బాలనగర్, పుప్పాలపల్లి తండా మాదాపూర్ , పడకల్ తండా పడకల్ తదితర పాఠశాలల లో సభ్యత్వ నమోదు చేపట్టడం జరిగింది. ఈ పర్యటనలో మండల అధ్యక్షుడు కే.అప్పిరెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు పి.దాస్, షేక్ మదర్, ఓ. శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిలర్ పి. విజయ్ కుమార్, రాజారత్నం ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు తదితరులు, పాల్గొన్నారు.