Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 December 2025, 5:14 pm Posted by : ramakrishna

కేంద్ర ప్రభుత్వం కొత్త విత్తన ముసాయిదా చట్టం వల్ల మళ్లీ కార్పొరేట్లదె పెత్తనం

 

. . . ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య

మెపాల్, బతుకమ్మ :

కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ముసాయిదా విత్తన చట్టం మళ్లీ కార్పొరేట్లకే లాభం చేకూర్చేదిగా ఉందని దీనివల్ల రైతులకు లాభపడేది గా లేదని అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య అన్నారు. మోపాల్ మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో భూమయ్య మాట్లాడుతూ దేశంలో విత్తనాలు నేటికీ 90 శాతం ప్రైవేటు కంపెనీలు కార్పొరేట్ బహుళజాతి కంపెనీలు విత్తనాలు రైతులకు సప్లై చేస్తున్నాయని ప్రభుత్వం కేవలం 10 శాతం మాత్రమే సప్లై చేస్తున్నాయని ఆయన అన్నారు. ఈనెల 11 వరకు ముసాయిదా విత్తన చట్టం తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం రైతుల అభిప్రాయాలు సేకరిస్తుందని, ఈ సందర్భంగా ఆ బిల్లులో నకిలీ విత్తనాలు నాసిరకం విత్తనాలు సప్లై చేసిన కంపెనీలపై చట్టపరమైన చర్యలు  తీసుకోవడానికి సరియైన నిబంధనలు అందులో లేవని అన్నారు. ఈ చట్టంలో విత్తనాలు సప్లై చేసే మోనిటరింగ్ కమిటీ కార్పొరేట్ల ప్రతినిధులు ఎక్కువ ఉంటారని అన్నారు. దేశంలో రైతులు సొంతంగా తయారు చేసుకునే హక్కులు కోల్పోతున్నారని అన్నారు. దేశంలో తయారైన విత్తనాల కన్నా విదేశాల్లో తయారీ విత్తనాలను బలవంతంగా ఈ దేశంలో దిగుమతి చేసుకొని రైతులకు అంటగడుతున్నారని రైతులను నిండా మున్చెయ్యాలని చూస్తున్నారని అన్నారు. ఇప్పటికీ దేశంలో ఉన్న ప్రభుత్వ విత్తన సంస్థలు మన రాష్ట్రంలో తెలంగాణ విత్తన అభివృద్ధి సంస్థ నిర్వీర్యం అయిపోయిందని అన్నారు. ఇప్పటికే ఈ సంస్థ కు బకాయి పంట రూ. 450 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవ్వడం లేదని అన్నారు విత్తనాలు తయారు చేసుకోవడానికి అనువైన మన తెలంగాణ ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఆ వైపుగా ప్రభుత్వం చర్యలు చేపట్టకపోగా కార్పొరేట్ల విధానాలపై ఆధార పడే విధంగా ప్రభుత్వాలు కొనసాగడం రైతుల మేలు కోరే చర్యలు కావని భూమయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా ఉపాధ్యక్షులు అగు ఎర్రన్న, ఎ. చిన్నయ్య, బండ మీది నరసయ్య తదితరులు పాల్గొన్నారు.

The central government's new seed draft law is once again giving corporates the upper hand.