- మాస్ లైన్ జిల్లా నాయకులు సురేష్
కమ్మర్ పల్లి, బతుకమ్మ : కార్మిక లోకం ప్రభుత్వాలతో పోరాడి పని గంట తగ్గించుకొని, హక్కులను సాధించుకొంటే కేంద్ర ప్రభుత్వం చట్టాలను రద్దు చేసి, నాలుగు కోళ్లుగా విభజించి రూపొందించిన చట్టాలను కాలరాస్తోందని సీపీఐ(ఎం. ఎల్)మాస్ లైన్ జిల్లా నాయకులు ఎస్. సురేష్ విమర్శించారు. గురువారం మే డే ను పురస్కరించుకొని మండల కేంద్రం లోని పార్టీ ఆఫీస్ వద్ద, మండలంలోని హశాకొత్తూరు గ్రామంలో ఎర్ర జెండాను ఎగరవేసి మే డే కార్యక్రమం ను నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కార్మికులు తమ సాధించుకున్న హక్కుల కోసం ఉద్యమించవలసిన అవసరం ఉందని కార్మిక లోకానికి ఆయన పిలుపునిచ్చారు.ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను, కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఎన్నికలే ప్రధాన ఎజెండాగా వాళ్ల గెలుపు కోసమే పనిచేస్తున్నారు తప్ప ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేని పరిస్థితిని మనం చూస్తున్నామన్నారు. కేంద్రంలో ఉన్న ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం వారిచ్చిన హామీలన్నిటిని నెరవేర్చాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో టి యు సి ఐ జిల్లా ఉపాధ్యక్షురాలు వి సత్తెమ్మ,సిపిఎంఎల్ మాస్ లైన్ మండల నాయకులు వి. బాలయ్య వి ఆనందు,టి బాలకిషన్, టి బాలయ్య,వి అశోక్ కే గంగాధర్,పెద్ది రాజేశ్వర్, ఎన్ మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.