- వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు అప్పగించడానికే మోడీ కుట్రలు
- ఏఐయుకేఎస్ రాష్ట్ర కార్యదర్శి బి.దేవారం
సిరికొండ, బతుకమ్మ : రైతుల్ని కేంద్ర ప్రభుత్వం నమ్మించి మోసం చేసిందని,వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు అప్పగించడానికే మోడీ కుట్రలు చేస్తున్నారని అఖిలభారత ఐక్య రైతుసంఘ(ఏ.ఐ.యు.కే.ఎస్.) రాష్ట్ర కార్యదర్శిబి. దేవారం ఆరోపించారు. మండలంలోని రావుట్లలో అఖిల భారత ఐక్య రైతు సంఘం (ఏ.ఐ.యు.కే.ఎస్ ) మండల అధ్యక్షులు ఎం నారగౌడ్ అధ్యక్షతన మండలాల సయుక్త ప్రథమ మహాసభను బుధవారం నిర్వహించి, సంఘం జెండాను ఎగురావేశారు. అనంతరం అమరవీరులను స్మరిస్తూ రెండు నిముషాలు మౌనం పాటించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతు దేశంలో రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉందని,కేంద్ర ప్రభుత్వం లక్షల కోట్ల కోటీశ్వరుల అప్పులు రద్దుచేశారన్నారు. కానీ రైతుల అప్పుల్ని మాత్రం రద్దు చేయలేదని,గిట్టుబాటు ధరలు లేక, చేసిన అప్పులు తీరక రైతాంగం తీవ్రమైన అప్పుల్లో కూరుకు పోయారన్నారు. ఆరుగాలం కష్టపడ్డ చేతికి చిల్లి గవ్వరాక రైతులు ఆందోళన చెందుతున్నారని, స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేయకుండా అడ్డుకుంటున్నారని తీవ్రంగా డ్యూయ్యబట్టారు. ఎం ఎస్ పి చట్టం చేసి రైతాంగానికి పంటల విషయంలో మినిమం గ్యారంటీగా ఉండేటట్లు చూడాలని ఆయన డిమాండ్ చేశారు. ఢిల్లీలో రైతాంగం చాలా రోజులుగా ఆందోళన చేస్తే వారి డిమాండ్స్ ను అమలు చేస్తామని రాతపూర్వక హామీ ఇచ్చినా కేంద్ర ప్రభుత్వం పాలరమైన సాక్షిగా అబద్ధాలు చెబుతూ ఆ హామీ తుంగలో తొక్కరన్నారు. రైతు సంఘం ఐక్యంగా ముందుకు వచ్చి పోరాడితేనే తమ సమస్యలు పరిష్కారం అవుతాయని, రైతులు మూటి కట్టకపోతే రైతులను నిండా ముంచుతారన్నారు.ఇప్పటికైనా ఐన రైతులంతా పోరాటాల సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఐ(ఎం. ఎల్) మాస్ లైన్ రాష్ట్ర నాయకులు పి. రామకృష్ణ, జిల్లా నాయకులు కార్యదర్శి ఆర్. రమేష్, అఖిల భారత ఐక్య రైతు సంఘం (ఏ.ఐ.యు.కే.ఎస్ ) జిల్లా అధ్యక్షులు ఎస్. సురేష్, జిల్లా కార్యదర్శి బి. బాబన్న , అఖిలభారత వ్యవసాయ కార్మికసంఘం (ఏఐపికేఎంఎస్) జిల్లా ప్రధానకార్యదర్శి ఇ. రమేష్ ప్రశాంగించగ అఖిల భారత ఐక్య రైతు సంఘం (ఏ.ఐ.యు.కే.ఎస్ ) జిల్లా నాయకులు ఆర్ దామోదర్, ఎం. లింబన్న,వి.భూమాగౌడ్, బి. బాలకిషన్, జి. కిరణ్, ఎం. మోహన్, ఏ. ఆశిస్, బి.సర్పంచ్ సాయిలు, జి. సాయరెడ్డి, బి. కిశోర్, ఎం. అనిస్, ఎస్. కిశోర్ తదితరులు పాల్గొన్నారు.
185