- న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : దేశంలో కేంద్ర ప్రభుత్వం అధ్యక్షతన మత రాజకీయాలతో గత 8 సంవత్సరాలుగా దేశ ప్రజలను జీఎస్టీ పేరుతో దోచి బడా బడా కంపెనీలకు, సంస్థలకు కట్టబెట్టింది అని ఆర్థిక దోపిడికి పాల్పడింది అని న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య అన్నారు. శనివారం పార్టీ నిజామాబాద్ డివిజన్ రాజకీయ శిక్షణా తరగతుల ప్రారంభోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ నేతలు జీఎస్టీ తగ్గించినం అని గొప్పలు చెప్పుకోవడం అంటే మళ్ళీ ప్రజలను మోసగించడమే అని విమర్శించారు. గతంలో నుండి ప్రజలపై విధించిన స్లాబ్ లు తప్పుడివి అని చెంపలు వేసుకోవాలని అన్నారు. దేశంలోని బడా కార్పొరేట్ కంపెనీలు చేసిన ఉత్పత్తులు (వస్తువులు) అమ్ముడుపోక పోవడంతో నిలువలు నిండు కుండటంతో జీఎస్టీ తగ్గించి ఉత్పత్తులు అమ్ముడు పోయేలా కంపెనీలు మేలు చేస్తున్నారని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వం మతం పేరుతో మెజారిటీ హిందూ ప్రజలను ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకుని మోసం చేస్తుంది అని దీన్ని ప్రజలు అర్ధం చేసుకుని మోడీ ఆర్థిక దోపిడిని వ్యతిరేకించాలి అని పిలుపునిచ్చారు. నిరుద్యోగం, ఉపాధి కల్పన, ఉద్యోగ భద్రత, కార్మిక వర్గం పై పని గంటల పెంపు, శ్రమ దోపిడి, కార్మిక వ్యతిరేక బిల్లులు, ప్రజల భద్రత, అధిక ధరలు, ప్రజలకు కావలసిన మౌలిక సదుపాయాలపై నిలదీయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూరు భూమయ్య, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నగర కార్యదర్శి నీలం సాయిబాబా, మాక్లూర్ మండల కార్యదర్శి దేశెట్టి సాయిరెడ్డి, డిచ్ పల్లి మండల కార్యదర్శి జె పి గంగాధర్, న్యూ డెమోక్రసీ డివిజన్ కమిటీ సభ్యులు మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.