కొత్త సీఈసీపై కసరత్తు ప్రారంభించిన కేంద్రం

వెబ్ న్యూస్, బతుకమ్మ  :  కొత్త సీఈసీపై కేంద్రం కసరత్తు ప్రారంభించింది. ఫిబ్రవరి 18తో సీఈసీ రాజీవ్ కుమార్ పదవీకాలం ముగియనుంది. 2022లో కేంద్ర ఎన్నికల అధికారిగా రాజీవ్  బాధ్యతలు చేపట్టారు. కొత్త సీఈసీ ఎన్నిక కోసం ప్యానెల్ సమావేశం కానుంది. ఈప్యానెల్ లో ప్రధాని మోడీ, విపక్ష నేత రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘావాల్ ఉన్నారు. ప్యానెల్ సూచనతో కొత్త సీఈసీని రాష్ట్రపతి నియమిస్తారు.