’శీష్ మహల్‘పై విచారణకు ఆదేశించిన కేంద్రం

వెబ్ న్యూస్, బతుకమ్మ  :  డిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేపట్టిన శీష్ మహల్ (సీఎం అధికారిక నివాసం) పునరుద్ధరణలో భారీ అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై విచారణకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దాదాపు 8 ఎకరాల విస్తీర్ణంలో 6 ఫ్లాగ్ స్టాఫ్ బంగ్లా పునరుద్ధరణకు ఆప్ ప్రభుత్వం భవన నిబంధనలను ఉల్లఘించిందనే ఆరోపణలున్నాయి. వీటిపై సమగ్ర నివేదిక తయారు చేయాలని కేంద్రం సీపీడబ్య్లూడీని ఆదేశించింది.