కేటీఆర్ పై కేసు అక్రమం
రాజకీయ కక్ష సాధింపులో భాగమే ఈ దుశ్చర్యలు రేవంత్ సర్కారు ఆగడాలను అడ్డుకుంటాం మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హైదరాబాద్, బతుకమ్మ: ఫార్ములా – ఈ కార్ రేసింగ్ లో అవకతవకలకు పాల్పడ్డారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ప్రభుత్వం పెట్టిన కేసు అక్రమమని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి ఒక ప్రకటనలో మండిపడ్డారు. కేటీఆర్ పై నమోదు చేసిన కేసు రాజకీయ కక్ష లో భాగమేనని ఆయన విమర్శించారు. ఈ రకమైన కాంగ్రెస్ దుశ్చర్యలు...