Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 April 2026, 6:11 pm Posted by : ramakrishna

అదుపు తప్పి కారు బోల్తా….

 

రుద్రూర్, బతుకమ్మ :

 

ఓ కారు అదుపుతప్పి బోల్తా పడిన ఘటన బుధవారం రాత్రి రుద్రూర్ మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సిరిపూర్ నుండి మోస్రా వైపు వెళ్తున్న టీఎస్ 21 ఎల్ 9222 బ్రిజా కారు రుద్రూర్- కోటగిరి గ్రామానికి వెళ్లే రహదారిలో బ్రిడ్జి వద్ద ఎదురుగా వస్తున్న పందిని ఢీ కొట్టడంతో బోల్తా పడింది. కారులో ఉన్న విట్టం పేట్ గ్రామానికి చెందిన డ్రైవర్ కారంగుల మహర్షి (30), ఏరాజ్ పల్లి గ్రామానికి చెందిన పోతురాజు చిన్న హన్మాండ్లు (38) లకు తీవ్ర గాయాలు కాగా స్థానికులు వెంటనే 108 అంబులెన్సులో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న ఎస్సై సాయన్న సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

 

The car went out of control and overturned...