Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 January 2025, 1:13 pm Posted by : ramakrishna

చెట్టును ఢీకొట్టి బోల్తాపడిన కారు

. ఒకరి దుర్మరణం.. ఇద్దరికి గాయాలు

వేల్పూర్, బతుకమ్మ : అతివేగం కారణంగా కారు చెట్టు ను ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్ధరికి గాయాలయ్యాయి. ఈ ఘటన శనివారం నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం అమీనా పూర్ వద్ద నిజాంసాగర్ కెనాల్ సమీపంలో చోటు చేసుకుంది. జక్రాన్ పల్లి మండలం అర్గుల్ గ్రామానికి చెందిన అల్లూరి శ్రవణ్ రెడ్డి (32) తన భార్య హారికారెడ్డి, వేల్పూర్ కు చెందిన బంధువు ధశరథ్ రెడ్డితో కలిసి వేల్పూర్ నుంచి స్వగ్రామానికి వస్తుండగా కారు అతివేగంగా దూసుకెళ్లి చెట్టను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో గాయపడిన శ్రవణ్ రెడ్డితోపాటు మిగతా ఇద్ధరిని అంబులెన్స్ లో  ఆస్పపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో శ్రవణ్ రెడ్డి మృతి చెందాడు. మిగతా ఇద్దరు ఆర్మూర్ లోని ఓ  ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వేల్పూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.