దేవీ నవరాత్రి ఉత్సవాల సందడి
బతుకమ్మ, నిజామాబాద్ అర్బన్ : నిజామాబాద్ నగరం లోని గాజులపేటలో సంతోషిమాత యూత్ ఆధ్వర్యంలో ఈ నెల22న సోమవారం రోజున దేవీ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి. మొదటి వార్షికోత్సవ లో భాగంగా భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. మాధవ్ పంతులు ఆధ్వర్యంలో భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంతోషిమాత యూత్ సభ్యులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.