. . . అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
నిజామాబాద్ బస్ స్టాండ్ ఆధునీకరించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ కోరారు. హైదరాబాద్ లోని సెక్రటేరియట్ లో మంగళవారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..నూతన బస్ స్టాండ్ స్థలం కేటాయించాలని అనేక సార్లు మంత్రులను కలిసినట్లు గుర్తుచేశారు. అప్పటి వరకు ప్రస్తుత బస్ స్టాండ్ ను సౌకర్యాలను మెరుగుపర్చాలన్నారు. ప్రయాణికుల కోసం విశాలమైన వేచియుండే హాలు ఏర్పాటు చేయాలని, బస్సుల రాకపోకల సమాచారాన్ని అందించే డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే సీసీ కెమెరాలను, తగిన సిబ్బందిని నియమించాలన్నారు. ప్రైవేటు వాహనాలు, ఆటో రిక్షాల కోసం ప్రత్యేక పార్కింగ్ సదుపాయం కల్పించాలన్నారు.