Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 December 2024, 11:41 am Posted by : ramakrishna

ఆర్టీసీ బస్సులో డీజిల్ ఖతం

. భిక్కనూరు టోల్ ప్లాజా వద్ద నిలిచిపోయిన బస్సు

. ప్రయాణికుల ఇబ్బందులు

భిక్కనూరు, బతుకమ్మ :  బోధన్ ఆర్టీసీ డిపోకు చెందిన బస్సులో డీజిల్ అయిపోవడంతో భిక్కనూరు టోల్ ప్లాజా సమీపంలో నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. డీజిల్ లేకుండా బస్సులు నడుపుతున్నారని ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయమై ప్రశ్నిస్తే డ్రైవర్ తమతో దురుసుగా ప్రవర్తించాడని ప్రయాణికులు వాపోతున్నారు. జీఎంఆర్ పెట్రోలింగ్ వాహనం పైలెట్ ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని గ్రహించి డీజిల్ తీసుకువచ్చారు. సంబంధిత అధికారులు బస్సు డ్రైవర్ పై చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.

The bus ran out of diesel