స్కూల్ కు వెళ్దామంటే బస్సు ఆపడం లేదు
లింగంపేట్, బతుకమ్మ: స్కూల్ వెళ్లేందుకు బస్సు లేక ఇబ్బందులు పడుతున్నామని మండలంలోని గాంధీనగర్ గ్రామ చిన్నారులు బుధవారం ధర్నా నిర్వహించారు. ప్రతి రోజూ ఉదయం స్కూల్ కు వెళ్లేందుకు బస్ స్టాప్ లో పడిగాపులు కాస్తున్నామని, బస్సులు ఆపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.