Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 February 2025, 6:00 pm Posted by : ramakrishna

ఎలక్షన్ సిబ్బందితో వెళ్తున్న బస్సుకు రోడ్డు ప్రమాదం

కరీంనగర్ జిల్లా – గంగాధర ఎక్స్ రోడ్డు వద్ద ఘటన

20 మందికి గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం

వెబ్ న్యూస్,బతుకమ్మ : ఎమ్మెల్సీ ఎలక్షన్ సిబ్బందితో వెళ్తున్న బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది. 20 మంది గాయపడ్డారు. ఈఘటన కరీంనగర్ జిల్లా – గంగాధర ఎక్స్ రోడ్డు వద్ద చోటుచేసుకుంది. నిర్మల్ నుంచి పోలింగ్ సామగ్రి తీసుకువచ్చి తిరిగి వెళ్తుండగా ముందు వెళ్తున్న బస్సును వెనక నుంచి ఎలక్షన్ సిబ్బందితో వెళ్తున్న బస్సు ఢీకొంది. ఈప్రమాదంలో 20 మంది గాయపడ్డారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.