Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 September 2025, 1:52 pm Posted by : ramakrishna

పురోహితుడి ఇంట్లో చోరీకి పాల్పడింది పాత నేరస్తులే

నిజామాబాద్ క్రైo, బతుకమ్మ : నగరంలోని ఐదో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బ్రాహ్మణ కాలనీలో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఐదు రోజుల్లోనే చేధించారు. పక్క ప్రణాళికతో పక్క కాలనీలో నివాసముండే పాత  నేరస్తులే చోరీకి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు.ఇద్దరు పాత నే రస్తులను అరెస్టు చేయగా సూత్రధారితోపాటు మరో ఇద్దరి పరారీలో ఉన్నారు. జల్సాల కోసం అలవాటు పడిన పాత నేరస్తులు చోరీ చేశారని ఆదివారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ సాయి చైతన్య తెలిపారు… సాయి చైతన్య తెలిపిన వివరాల ప్రకారo…. బ్రాహ్మణ కాలనీకి చెందిన పురోహితుడు వేలేటి పవన్ శర్మ ఈనెల 23న కుటుంబ సమేతంగా దుర్గా పూజ కోసం ఇంటికి తాళం వేసి వెళ్లాడు. గంటల వ్యవధిలో పూజ ముగించుకొని ఇంటికి వచ్చిన పవన్ శర్మ ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి తన ఇంటి తాళాలు పగలగొట్టి పడక గదిలో ఉన్న బీరువా లాకర్ బద్దలు కొట్టి దాదాపు 33 తులాల బంగారం, 25 తులాల వెండి,రూ. 30,000 దొంగిలించారని ఐదో టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నిజామాబాద్ నార్త్ సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థానిక ఎస్సై గంగాధర్ తో కలిసి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. నాగారం దొడ్డి కొమురయ్య కాలనీ చెందిన షేక్ సల్మాన్ అలియాస్ సోను మరాటి ఆకాష్ లను ఆదివారం ఉదయం డబుల్ బెడ్ రూమ్ వద్ద అరెస్టు చేసినట్టు సీపీ తెలిపారు. వారిద్దరు ఇచ్చిన సమాచారం మేరకు నాగారం దొడ్డి కొమురయ్య కాలనీకి కాలనీకి చెందిన పాత నేరస్తుడు ఏ 1షేక్ సాదక్, ఏ2- వినోద్ చౌహాన్, ఏ 3-ముక్తే సాయినాథ్, ఏ 4 – షేక్ సల్మాన్ @ సోనూ, ఏ 5- ఆకాశ్ వీరు ఐదుగురు ఒక ముఠాగా ఏర్పడి వారి జల్సాలకు డబ్బులు సరిపోక దొంగతనాలు చేయడమే  ప్రవృత్తిగా చేసుకున్నారు. ఇందులో ఎ 1- షేక్ సాదక్ ముఠాకు లీడర్ గా ఉంటూ ముఠాని నడిపిస్తున్నారు. ఏ 1- షేక్ సాదక్ మీద గతంలో దొంగతనము,గంజా కేసులు ఉన్నాయి. ఎ 2-వినోద్ చౌహాన్, ఎ 3-ముక్తే సాయినాథ్ ఇంతకుముందు కూడా వివిధ దొంగతనాల కేసులలో ఉన్నారు.ఈ నెల 23న ఐదుగురు కలిసి ఆటోలో బ్రహణ కాలనీలో తాళం వేసిన ఇళ్లను రెక్కి చేసి, దొంగతనం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అదే క్రమంలో పవన్ శర్మతన ఇంటికి తాళం వేసి దుర్గమత పూజకు వెళ్లారు. దీంతో నిందితులు 8గంటలకు ఇంటి తాళం పగలగొట్టి లోనికి వెళ్లి  లాకర్ లో ఉన్న 33 తులాల బంగారు ఆభరణాలు, 25 తులాల వెండి వస్తువులు, రూ.30,000 నగదు చోరీ చేశారు.  ఆదివారం ఉదయం నమ్మదగిన సమాచారం మేరకు డబుల్ బెడ్ రూమ్ చౌరస్తా వద్ద నిందితుడు A-4, A-5 ఇద్దరు ఆటోలో అనుమానాస్పదంగా వెళ్తుండగా, పట్టుకొని విదారించగ A-4 వద్ద నుండి పైన తెలిపిన దాదాపు 31 తులాల బంగారు ఆభరణాలు , A-5 వద్ద నుండి   ఆటోను, మొబైల్ ను పోలీసులు  స్వాధీనం చేసుకున్నారు.   ఈకేసు చేధనకు నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో రెండు టీంలు ఏర్పాటు చేశారు.  ఈ కేసులో నిందితులు గా ఉన్న షేక్ సల్మాన్ @ సోనూ, మరాటి ఆకాశ్ ల ను పట్టుకున్నారు. నిందితులను పట్టుకున్న  పోలీసు సిబ్బందిని సీపీ పి. సాయి చైతన్య అభినందించారు.