Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 January 2025, 4:13 pm Posted by : ramakrishna

అధికార యంత్రాంగం కృషి చేస్తుంది

బతుకమ్మ,మోర్తాడ్: రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు ఈ సంక్షేమ పథకాలు అర్హులకు అందించడంలో అధికార యంత్రాంగం సమిష్టి కృషి చేస్తుందని మోర్తాడ్ ఎంపీడీవో తిరుమల దేవి అన్నారు. మోర్తాడ్ మండలంలోని శెట్ పల్లీ గ్రామంలో గురువారం గ్రామసభ నిర్వహించారు. ఈ సభలో కొంత వ్యతిరేకంగా ఇబ్బందులు తలెత్తడంతో మోర్తాడ్ ఆర్ ఐ రంజిత్ కుమార్ స్పందించి ప్రభుత్వం అందిస్తున్న నాలుగు పథకాలకు అర్హులైన వారికి అందిస్తామని ఎవరైనా లిస్టులో పేరు లేకుండా అర్హులైన వారు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని వారి జాబితాను రూపొందిస్తామని పథకాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించి సావధానంగా వారికి సమాధానం తెలిపి లిస్టులో పేరు లేని వారు, అర్హులైన వారి నుంచి దరఖాస్తులను స్వీకరించారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారి హరీష్ కుమార్, పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్, ఉపాధి హామీ క్షేత్ర సహాయకుడు చంద్రమోహన్, కారోబార్ పృధ్విరాజ్, రాజ్ కుమార్, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

The bureaucracy works hard