బట్టి బడ్జెట్ సబ్బండ వర్గాలను నిరాశపరిచింది
అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2025-26 సంవత్సరానికి సంబందించి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ సబ్బండ వర్గాలను నిరాశపరిచిందని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతు.. తెలంగాణ సబ్బండా వర్గాలను మోసం చేసే విదంగా అన్ని వర్గాల ప్రజల ఆశలను నిరాశలుగా మార్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకే కులానికో కార్పొరేషన్ ఏర్పాటు చేసారు...