Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 January 2026, 7:49 pm Posted by : ramakrishna

రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ జండా ఎగురవేయాలి

. . . రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డి, మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

రాబోయే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ జండా ఎగురవేయాలని రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డి, మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిలు అన్నారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సన్నాహక సమావేశానికి ముఖ్య అతిధిగా రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డి, మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సి వి.జి గౌడ్ లు పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ అభివృద్దే మన ఏజెండా అని ఉద్యమ పార్టీగా మొదలైనప్పటి నుండి ఎన్నో ఎలక్షన్ లలో కొట్లాడిన చరిత్ర మనదని , బీఆర్ఎస్ పార్టీ ప్రజల పార్టీ అని అన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గడిచిన 10 సంవత్సరాల కాలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించినట్లు గుర్తు చేసారు. కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధి ప్రజల వద్దకు తీసుకువెళ్లి ప్రజలను ఓట్లు అడిగే అర్హత కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మాత్రమే ఉందని గుర్తు చేసారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్త మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత నగరంలోని ఏ ఒక్క డివిజన్ లో కూడా కొత్త అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయలేదనే విషయాన్ని ప్రజల వద్ద ప్రస్థావించాలని కోరారు. గడిచిన 10 సంవత్సరాలలో ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అందుబాటులోకి తెచ్చినట్లు గుర్తు చేశారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పరుచుటకు ప్రతి ఒక్క డివిజన్ లో కనీసం ఒక పార్క్ ఉండే విధంగా పార్కులను, బొడ్డెమ్మ చెరువును అభివృద్ధి చేశామని అన్నారు. దశాబ్దాల కాలంగా కనీసం పూడికతీతకు నోచుకోని ఎన్నో నాలాలను శుభ్రం చేసి వర్షాకాలంలో వరద నీటిని మల్లించెందుకు స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజీలను నిర్మించి కాలనీలలో నీరు చేరకుండా చేశామని గుర్తు చేసారు. నగరంలోని అన్ని కులాల కమ్యూనిటీ హాల్స్ నిర్మాణానికి నిధులు అందించి సేవ చేశామని అన్నారు. రాజకీయాలకు అతీతంగా కరోనా సమయంలో ప్రజలకు ఇబ్బందులు ఎదురుకాకుండా ఎన్నో కార్యక్రమాలు చేసిన విషయాన్ని గుర్తు చేయాలని అన్నారు. మహిళా దినోత్సవం, ఆశ వర్కర్లను, అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్, మహిళా సంఘాల నాయకులు, నర్సులు, కార్మిక దినోత్సవం సందర్బంగా మున్సిపల్ కార్మికులను దీపావళి సందర్బంగా మార్కెట్ కమిటీలో పని చేసే కార్మికులను ప్రజలందరిని అక్కున చేర్చుకున్నామని అన్నారు. గడిచిన 10 సంవత్సరాల బిఆర్ఎస్ పాలన, ఈ రెండు సంవత్సరాల కాంగ్రెస్ పాలన లో జరిగిన అభివృద్ధి సంక్షేమ పాలన గురించి ప్రజలలో చర్చ వచ్చే విధంగా కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ దండు నీతు కిరణ్ శేఖర్, నగర అధ్యక్షులు సిర్ప రాజు, సీనియర్ నాయకులు, సత్యప్రకాష్, సుజిత్ సింగ్, నవీద్ ఇక్బాల్, మైనారిటీ ప్రెసిడెంట్ ఇమ్రాన్ శేహజాద్, అబ్దుల్ మతీన్ తదితరులు పాల్గొన్నారు.

 

The BRS flag should be hoisted in the upcoming elections.
The BRS flag should be hoisted in the upcoming elections.